ఈ 3 ప్రశ్నలకు.. సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి: పవన్‌

ఏపీలో వాలంటీర్ల విధులు, వారి విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి.

By అంజి  Published on  23 July 2023 8:15 AM GMT
Janasena, Pawan Kalyan, CM Jagan, Volunteers

ఈ 3 ప్రశ్నలకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి: పవన్‌

ఏపీలో వాలంటీర్ల విధులు, వారి విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు సంచలనం అయ్యాయి. వాలంటీర్లు సేకరించే ప్రజల పర్సనల్‌ డేటాపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. వాలంటీర్‌ వ్యవస్థపై పవన్‌ కల్యాణ్‌ గత కొన్ని రోజులుగా వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల వాలంటీర్లను నిలదీస్తున్న ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పవన్‌ మరోసారి ఇదే అంశంపై ట్వీట్‌ చేశారు. తాను అడిగే మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.

''అందరి ఆందోళన ఒక్కటే.. మై డియర్ వాట్సన్! మీరు సీఎం అయినా, కాకపోయినా డేటా గోప్యత చట్టాలు అలాగే ఉంటాయి. కాబట్టి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఒకటవ ప్రశ్న.. వాలంటీర్లకు బాస్‌ ఎవరు, రెండవ ప్రశ్న.. ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు?, మూడవ ప్రశ్న.. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. వారికి ప్రజల పర్సనల్‌ డేటా సేకరించే అధికారం ఎవరు ఇచ్చారు?'' అని సీఎం జగన్‌ని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు.

‘‘వ్యక్తిగత సమాచారం ఎవరైనా ప్రైవేటు వ్యక్తి దగ్గర ఉంటే అది క్రైమ్’’ అంటూ గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story