పవన్ కళ్యాణ్ పొత్తు తప్పదని చెప్పేశారుగా..!

Janasena Chief Pawan Kalyan Interesting Comments On Alliances. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు.

By Medi Samrat  Published on  8 May 2022 6:05 PM IST
పవన్ కళ్యాణ్ పొత్తు తప్పదని చెప్పేశారుగా..!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆయన రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి.. పలు రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అద్భుత పరిపాలన అందించి ఉంటే.. జనసేన కౌలు భరోసా యాత్ర చేయాల్సి వచ్చేది కాదని, తాము సాయం చేస్తుంటే వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చే దిశగా తాము బలంగా అడుగులు వేస్తున్నామని, తాము వైఎస్సార్సీపీకి వ్యతిరేకం కాదనే విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు పవన్ కళ్యాణ్. 151 మంది ఎమ్మెల్యేలు ఎంతో హుందాగా రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించే అవకాశం ఉన్నా.. ఎంతో దౌర్జన్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. వారు ఈ పద్ధతి మార్చుకోవాలని, ఆ పార్టీ నేతల బెదిరింపులకు ఎవరూ భయపడే పరిస్థితులు లేవన్నారు. పొత్తులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజల అభివృద్ధే ముఖ్యమన్నారు. ప్రభుత్వ పాలన తీరుతోనే తాను గతంలో వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓట్లను చీల్చబోమని వ్యాఖ్యానించానని, వ్యతిరేక ఓటు చీలి మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళుతుందన్నారు.

రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రత్యామ్నయ ప్రభుత్వం రావాలని, జనసేనతో ఎవరెవరు కలిసి వస్తారో తనకు తెలియదన్నారు. తాను ఎప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకోలేదు అన్నారు. వైసీపీని ఓడించకపోతే రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది అన్నారు. అయితే పొత్తుల విషయంలో చర్చలు అవసరం అlhleరు. పొరపాటున వైసీపీ అధికారంలోకి రాష్ట్ర పరిస్థితి దిగజారిపోతుంది. అందుకు చాలా పార్టీలు కలిసి రావాలి అన్నారు. ప్రస్తుతం తనకు బీజేపీతో పొత్తు ఉందన్నారు. తమ మధ్య సన్నిహిత్యం కూడా చాలా బలంగానే ఉందన్నారు.












Next Story