జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ శ‌నివారం విజ‌య‌వాడ‌కు రానున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంట‌ల ప్రాంతంలో విమానంలో ప‌వ‌న్ విజ‌య‌వాడ‌కు చేరుకోన‌న్నారు. రేపు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేయనున్నారు జనసేనాని. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు. ప్ర‌భుత్వ విధానాల‌పై పార్టీ నేత‌ల‌తో ప‌వ‌న్ చ‌ర్చించ‌నున్నారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story