ఏలూరు జిల్లాలో ప‌వ‌న్‌.. కౌలు రైతు కుటుంబాల‌కు రూ.ల‌క్ష చొప్పున సాయం

Janasena Chief Pawan Kalyan at Eluru District.జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. జ‌న‌సేన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 April 2022 1:23 PM IST
ఏలూరు జిల్లాలో ప‌వ‌న్‌.. కౌలు రైతు కుటుంబాల‌కు రూ.ల‌క్ష చొప్పున సాయం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా యాత్ర‌లో భాగంగా ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల‌ను ప‌వ‌న్ ప‌రామ‌ర్శిస్తున్నారు. శ‌నివారం పెద‌వేగి మంలం విజ‌య‌రాయిలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతు మ‌ల్లికార్జున కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. మ‌ల్లికార్జున కుటుంబ నేప‌థ్యం గురించి ప‌వ‌న్ అడిగితెలుసుకున్నారు. మ‌ల్లికార్జున కుటుంబ స‌భ్యులకు ధైర్యం చెప్పారు. మ‌ల్లికార్జున కుటుంబానికి రూ.ల‌క్ష ఆర్థిక సాయాన్ని అందించారు.

జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా యాత్ర‌లో భాగంగా నేడు ప‌వ‌న్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న 41 మంది కౌలు రైతు కుటుంబాల‌కు ప‌రామ‌ర్శించి రూ.ల‌క్ష చొప్పున సాయం అందించ‌నున్నారు. ఇందుకోసం ఈ ఉద‌యం ప‌వ‌న్ కల్యాణ్ గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయికి చేరుకున్నారు. అనంత‌రం లింగ‌పాలెం మండ‌లం ధ‌ర్మాజీగూడెం, లింగ‌పాలెం ప్రాంతాల‌కు చెందిన కౌలు రైతు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి చింత‌ల‌పూడి వ‌ద్ద ర‌చ్చ‌బండ‌లో ప‌వ‌న్ పాల్గొన‌నున్నారు.

Next Story