AndhraPradesh: పవన్ చేతికి పవర్.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు
జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
By అంజి Published on 19 Jun 2024 11:14 AM ISTAndhraPradesh: పవన్ చేతికి పవర్.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు
జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్‌లోని తన క్యాంప్ ఆఫీసులో వేద మంత్రోచ్ఛరణలు, పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. జనసేన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత పవన్ చేతికి పవర్ రావడంతో ఆయన అభిమానులు, ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్‌లో డిప్యూటీ సీఎం పవన్ క్యాంప్ ఆఫీసు ఉంది. దీంతో ఆ ఆఫీసు ముందు ఏర్పాటు చేసిన నేమ్ బోర్డు ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొణిదల పవన్ కల్యాణ్, ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రివర్యులు అని నేమ్ బోర్డుపై రాసి ఉంది.
చిరంజీవి జీవిత భాగస్వామి సురేఖ కొణిదెల బహుమతిగా ఇచ్చిన పెన్నుతో పవన్ కళ్యాణ్ సంతకం చేశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, గ్రూప్-1, గ్రూప్-2 అధికారులతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు.
#Andhrapradesh - జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్‌లోని తన క్యాంప్ ఆఫీసులో వేద మంత్రోచ్ఛరణలు, పండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. జనసేన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఏళ్ల… pic.twitter.com/4bmCk0SCzW
— Newsmeter Telugu (@NewsmeterTelugu) June 19, 2024
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన 175 స్థానాలకు గానూ 164 స్థానాల్లో ఘనవిజయం సాధించాయి. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 సీట్లు గెలుచుకున్నాయి. పిఠాపురం సీటులో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన తన సమీప వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగగీతపై 70,279 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని కుట్టడంలో నటుడిగా మారిన రాజకీయ నాయకుడు కీలక పాత్ర పోషించారు. అతను గెలిచిన తరువాత, అతను ఆంధ్రప్రదేశ్‌లో కింగ్ మేకర్ అని పిలుచుకున్నాడు. ఇటీవల దేశ రాజధానిలో జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కళ్యాణ్‌ను "ఆంధీ (తుఫాను)"గా అభివర్ణించారు.