సంక్రాంతి పండగ సందర్భంగా చిత్తూరు జిల్లాలో జల్లికట్టు చాలా కోలహాలంగా జరిగింది. గిత్తలు పరుగులు తీస్తుండగా.. వాటిని నిలవరించేందుకు యువత ఎంతగానో పోటీ పడ్డారు. గిత్తల కొమ్ములకు కట్టిన పలకలను దక్కించుకునేందుకు సాహసాలు చేశారు. అయితే ఈ క్రమంలో చాలా మంది గాయపడ్డారు. జనవరి 16, ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో నిర్వహించిన జల్లికట్టులో పాల్గొన్న 30 మంది గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఆదివారం స్థానిక జల్లికట్టు ఆట 'పశువుల పండుగ' జరిగింది. ఈ కార్యక్రమంలో పొరుగున ఉన్న నెల్లూరు, కడప జిల్లాల నుంచి వచ్చిన వందలాది మంది పాల్గొన్నారు.
కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించి, చంద్రగిరి మండల పరిధిలోని వార్షిక కార్యక్రమంలో 500 పైగా ఎద్దులు, చాలా మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలిసిన వివరాల ప్రకారం.. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న వారిలో 30 మందికి పైగా గాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని గుండుపల్లి మండలం పరిధిలో కూడా జల్లికట్టు కార్యక్రమాలు జరిగాయి. ఇక జల్లికట్టును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారం చిత్తూరులో 1,124 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం 4,570 కేసులు నమోదయ్యాయి.