అలా వాటిని కైవసం చేసుకున్న టీడీపీ

మునిసిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నరసింహారావుతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో జగ్గయ్యపేట మున్సిపాలిటీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంపార్టీ చేజిక్కించుకుంది.

By Medi Samrat  Published on  14 Sept 2024 11:00 AM IST
అలా వాటిని కైవసం చేసుకున్న టీడీపీ

మునిసిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, ఆయన తండ్రి రంగాపురం నరసింహారావుతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో జగ్గయ్యపేట మున్సిపాలిటీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంపార్టీ చేజిక్కించుకుంది. మంత్రి నారా లోకేష్‌ ఉండవల్లిలోని తన నివాసంలో వీరిని కలిశారు. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన లోకేష్ ప్రజా సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా కృషి చేయాలని, జగ్గయ్యపేట మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.

వైసీపీకి చెందిన ఐదుగురు కార్పొరేట‌ర్లు టీడీపీలో చేరడంతో ఏలూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ టీడీపీ సొంతం చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే బ‌డేటి చంటి స‌మ‌క్షంలో వైసీపీ కార్పొరేట‌ర్లు దాపు అనూష‌, క‌ల‌వ‌కొల్లు సాంబ‌, ప్ర‌వీణ్ కుమార్, జ‌న‌ప‌రెడ్డి, అర్జి స‌త్య‌వ‌తి టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. న‌గ‌ర మేయ‌ర్ నూర్జ‌హాన్‌, పెద‌బాబు దంప‌తులతో పాటు 27 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ లోకి వెళ్లడం, ఇప్పుడు ఐదుగురు టీడీపీలో చేర‌డంతో కౌన్సిల్‌లో వైసీపీ దూరమైంది.

Next Story