గుడ్‌న్యూస్‌.. త్వరలోనే జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు నాలుగో విడత విద్యా దీవెన నిధులను ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

By అంజి  Published on  2 Dec 2023 8:44 AM IST
jagananna vidya deevena, APnews, CM YS Jagan

గుడ్‌న్యూస్‌.. త్వరలోనే జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు నాలుగో విడత విద్యా దీవెన నిధులను ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం జగన్‌ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలుస్తోంది. విద్యార్థులకు పూర్తి రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఏటా నాలుగు విడతల్లో అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 28న 8,44,336 మంది ఖాతాల్లో రూ.680 కోట్లను సీఎం జగన్‌ జమ చేశారు. ప్రభుత్వ వర్గాల నుంచి తాజాగా అందిన సమాచారం ప్రకారం.. డిసెంబర్ 7న జగనన్న విద్యా దీవెన డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమకానున్నాయి.

సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి నిధులు విడదుల చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో హయ్యర్‌ స్టడీస్‌ చేసే విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్, ఇతర కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు డబ్బులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఇంజినీరింగ్ లేదా డిగ్రీ చదివే విద్యార్థులకు ఏటా రూ. 20 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. అలాగే పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు రూ. 15 వేలు, ఐటీఐ చదివే విద్యార్థులకు రూ. 10 వేలు ఆర్థిక సాయం అందజేస్తోంది.

Next Story