లక్షా 84వేల ఉద్యోగాలను కల్పించాం : సీఎం జగన్
Jagananna Chedodu Scheme 2nd Phase Funds Release.జగనన్న చేదోడు పథకం కింద వరుసగా రెండో ఏడాది కూడా
By తోట వంశీ కుమార్ Published on 8 Feb 2022 1:03 PM ISTజగనన్న చేదోడు పథకం కింద వరుసగా రెండో ఏడాది కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నిధులను విడుదల విడుదల చేశారు. జగనన్న చేదోడు పథకం పథకంలో భాగంగా రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు ప్రభుత్వం ఏటా రూ.10 వేల సాయం అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,85,350 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.285.35 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. వృత్తిపరంగా రజక, నాయీ బ్రాహ్మణులవి అమూల్య సేవలని కొనియాడారు.
షాపులున్న 1,46,103 మంది టైలర్లుకు రూ. 146.10 కోట్లు, షాపులున్న 98,439 మంది రజకులకు 98.44 కోట్లు, షాపులున్న 40,808 మంది నాయీబ్రాహ్మణులకు రూ. 40.81 కోట్ల సాయం అందిస్తున్నామన్నారు. లంచాలు, వివక్షతకు తావు లేకుండా పారదర్శకంగా పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. చేతి వృత్తుల వారు అన్ని రకలుగా ఎదగాలని తపించామన్నారు. మత్స్యకార భరోసా, నేతన్న నేస్తంతో అండగా నిలిచినట్లు తెలిపారు. చేతి వృత్తుల పనివారు బతకలేకపోతే వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి నెలకొంటుందన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గత ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సమ్మె జరుగుతుందంటే ఎల్లోమీడియాకు పండగ సీఎం అన్నారు. సంధి జరిగి.. ఉద్యోగులు సమ్మెకు వెళ్లకపోయే సరికి వారికి మంట అని అన్నారు. ఉద్యోగులు సమ్మె విరమించారనగానే కమ్యూనిస్టులను ముందుకు తోశారని మండిపడ్డారు. 51 వేల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక లక్షా 84 వేల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు.