అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టం..జగన్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలకు కొందరు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు.

By Knakam Karthik  Published on  18 Feb 2025 1:35 PM IST
AndraPradesh, Vijayawada, YS Jagan, Vallabhaneni Vamsi, Ysrcp, Tdp, Police

అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టం..జగన్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలకు కొందరు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. విజయవాడ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. పోలీసులు టోపీపై ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టండి, టీడీపీ నేతలకు సెల్యూట్ కొట్టి, వారు చెప్పినట్లు చేసి అన్యాయం చేస్తే మాత్రం బాగుండదని హెచ్చరించారు. రేపు మళ్లీ అధికారంలోకి వస్తాం.. అన్యాయం చేసిన ఈ అధికారులు, నాయకులందరినీ బట్టలు ఊడదీసి నిలబెడతాం, ఎవరినీ వదిలిపెట్టం. రిటైర్ అయినా, సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తాం..అని వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు.

వల్లభనేని వంశీపై పెట్టింది ఫాల్స్ కేసు అని, నిజంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయానని జగన్ విమర్శించారు. వంశీ అరెస్టు దారుణం అని, వంశీ ఎలాంటి తప్పు చేయలేదని గన్నవరం టీడీపీ కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్ధన్ చెప్పినా, తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారు. పట్టాభిని చంద్రబాబు కావాలనే గన్నవరం పంపి, వంశీని తిట్టించారు అని జగన్ ఆరోపించారు. పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతలపై దాడి చేశారు, మంగళగిరికి సత్యవర్ధన్‌కు పిలుపించుకుని మరో ఫిర్యాదు చేశారు అని జగన్ అన్నారు.

వైసీపీ నేతలపై పెట్టే ప్రతీ కేసు చట్ట వ్యతిరేకమేనని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. ఈ తప్పుడు కేసులు వాళ్లకే చుట్టుకుంటాయి. అప్పుడు వీరి పరిస్థితి అతి దారుణంగా తయావుతుంది. తన సామాజిక వర్గం నుంచి ఒకడు ఎదుగుతున్నా చంద్రబాబు తట్టుకోలేడు. చంద్రబాబు, లోకేశ్‌లకు వారి సామాజికర్గ వర్గంలో ఇతరులు గ్లామర్‌గా ఉంటే నచ్చదని జగన్ చెప్పారు.అందుకే వంశీపై కక్ష కట్టారని, రేపో మాపో దేవినేని అవినాష్, కొడాలి నానిలను కూడా అలాగే చేస్తారని జగన్ ఆరోపించారు.

Next Story