ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో ఆయన పర్యటనకు కోర్టు అనుమతి తప్పనిసరి కావడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. జనవరి 11 నుంచి 15 వరకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఇది వ్యక్తిగత యూరప్ పర్యటన అని ఆయన తెలిపారు.
క్విడ్ ప్రోకో కేసులకు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన కేసుల్లో వైఎస్ జగన్ షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నారు. విదేశాలకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సీబీఐ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది.