కుటుంబ గొడవలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

తన కుటుంబంలో గొడవలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు

By Medi Samrat  Published on  24 Oct 2024 4:06 PM IST
కుటుంబ గొడవలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

తన కుటుంబంలో గొడవలపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబ గొడ‌వ‌లు ప్ర‌తి ఇంట్లో ఉండేవేన‌ని, వాటిని అడ్డుపెట్టుకుని రాజ‌కీయాలు చేయ‌డం కరెక్ట్ కాద‌న్నారు. ప్రభుత్వం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై దృష్టిసారించాల‌న్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని, టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని మళ్లీ డైవర్షన్స్‌ మొదలుపెట్టారని విమర్శించారు.

ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం చేస్తున్నారని.. ఇప్ప‌టికైనా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ ఆపి, హామీల‌ను అమ‌లు చేయాల‌ని అన్నారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా జ‌గ‌న్ పేరు చెప్పి డైవ‌ర్ట్ చేయ‌డం ప్ర‌భుత్వానికి ఓ పనిగా మారింద‌ని విమర్శించారు. జగన్‌ గుర్లకు వస్తున్నాడని తెలిసి మళ్లీ రాజకీయం చేస్తున్నారు. మా కుటుంబ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. వైఫల్యాలను డైవర్ట్‌ చేసేందుకే లడ్డూ అంశం తెరపైకి తెచ్చారని కావాలనే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం దృష్టిసారించాలన్నారు. విజయనగరంలో డయేరియాతో చనిపోయిన కుటుంబానికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

Next Story