అమరావతి: రాష్ట్రంలోని స్కూళ్లకు 9 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 13న భోగి, 14న సంక్రాంతి, 15న కుమ పండుగలు జరగనున్నాయి. దీంతో పాఠశాలలకు 10వ తేదీ నుంచి 18 వరకు హాలిడేస్ ఉండే అవకాశం ఉంది. 19న స్కూళ్లు తిరిగి తెరుచుకుంటాయి. దీనిపై త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
జనవరి 10 రెండో శనివారం కావడంతో సెలవు ఉండనుంది. జనవరి 11 ఆదివారం వచ్చింది.. జనవరి 18 కూడా ఆదివారమే. ఇలా సంక్రాంతి సెలవులు ఆరు రోజులు ఉంటే.. రెండో శనివారంతో పాటుగా, మరో రెండు రోజులు ఆదివారాలు రావడంతో 9 రోజులు సెలవులు వస్తున్నాయి. జనవరిలో వసంత పంచమి, గణతంత్ర దినోత్సవం వంటి ఇతర సెలవులు కూడా ఉన్నాయి.
జనవరి 23న వసంత పంచమి, జనవరి 24న రెండో శనివారం, జనవరి 25న ఆదివారం, జనవరి 26న గణతంత్ర దినోత్సవాలకు సెలవులు ఉండనున్నాయి. అటు తెలంగాణలో ఈ తేదీల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. తెలంగాణలో జనవరి 10 నుంచి జనవరి 17 వరకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.