నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2

ISRO launches SSLV D2 Rocket from Shar.ఇస్రో చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Feb 2023 5:00 AM GMT
నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2ని ప్ర‌మోగించింది. తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట స‌మీపంలో ఉన్న స‌తీష్ ధవ‌న్ స్పేస్ సెంట‌ర్‌(షార్‌)లోని మొద‌టి ప్ర‌యోగ వేదిక నుంచి ఉద‌యం 9.18 గంట‌ల‌కు వాహ‌క‌నౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకువెళ్లింది. ఈ ప్ర‌యోగం విజ‌య‌వంతంగా పూర్తైన‌ట్లు ఇస్త్రో శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.

ఎస్ఎస్ఎల్‌వీ-డీ2 రాకెట్ మొత్తం పొడ‌వు 34 మీట‌ర్లు కాగా వెడ‌ల్పు రెండు మీట‌ర్లు, బ‌రువు 119 ట‌న్నులు. . ఈ ప్ర‌యోగం ద్వారా ఇస్రోకు చెందిన 156.3కిలోల బరువు కలిగిన ఈవోఎస్-07 ఉపగ్రహంతో పాటు 11.5 కిలోల బ‌రువున్న యూఎస్ఏ అంటారిస్ సంస్థకు చెందిన జానుస్-1 అలాగే చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2 ను క‌క్ష్య‌లో ప్రవేశ‌పెట్టారు.

ఈ ప్ర‌యోగం 15 నిమిషాల్లో పూరైంది. 450 కిలో మీటర్ల ఎత్తులో 785 సెకన్ల వ్యవధిలో ఈవోఎస్-07 అదేవిధంగా, 880 సెకన్ల వ్యవధిలో జానుస్-1ను, 900 సెకన్లకు ఆజాదీశాట్ ను కక్ష్యలోకి ప్ర‌వేశ‌పెట్టింది.

Next Story