'అన్వేష'తో ఈ ఏడాది ఇస్రో మరో సరికొత్త ప్రయోగం..రేపే నింగిలోకి
ఇస్రో 2026 ప్రస్థానాన్ని సరికొత్త ప్రయోగంతో ప్రారంభించేందుకు సర్వసన్నద్ధం అయింది.
By - Knakam Karthik |
'అన్వేష'తో ఈ ఏడాది ఇస్రో మరో సరికొత్త ప్రయోగం..రేపే నింగిలోకి
ఆంధ్రప్రదేశ్: గత కొన్నేళ్లుగా అంతరిక్ష రంగంలో తిరుగులేని విజయాలను నమోదు చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో).. 2026 ప్రస్థానాన్ని సరికొత్త ప్రయోగంతో ప్రారంభించేందుకు సర్వసన్నద్ధం అయింది. సూపర్ పవర్ ఉపగ్రహం అన్వేష (Anvesha - EOS-N1) ప్రయోగంతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించబోతోంది. జనవరి 12న (సోమవారం) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సీ62 (PSLV-C62) రాకెట్ ద్వారా ఈ అన్వేష ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది సాధారణ నిఘా నేత్రం కాదని.. శత్రువుల గుట్టు రట్టు చేసే హైపర్‌స్పెక్ట్రల్ కన్ను అని ఇస్రో వర్గాలు చెబుతున్నాయి.
అన్వేష ప్రత్యేకతలు
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ( డీఆర్‌డీఓ ) అభివృద్ధి చేసిన ఈ అన్వేష శాటిలైట్ భారత సైన్యానికి సరికొత్త బలాన్ని చేకూర్చనుంది. సాధారణ కెమెరాలు కేవలం రంగులను మాత్రమే కనిపెడతాయి. కానీ అన్వేష శాటిలైట్ మాత్రం.. కాంతిని వందలాది అతి సూక్ష్మ తరంగాలుగా విడగొట్టి చూసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల నేల మీద ఉన్న వస్తువు దేనితో తయారైందో (మెటీరియల్ ఫింగర్‌ప్రింట్) స్పష్టంగా తెలిసిపోతుంది.
ఈ మిషన్ కేవలం ఒక సాధారణ విమానం కాదు; గత సంవత్సరం సాంకేతిక లోపం తర్వాత PSLV తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఇది చాలా కష్టమైన పని. మే 18, 2025న, PSLV ఒక అరుదైన మధ్య-విమాన వైఫల్యాన్ని చూసింది, మూడవ దశలో పీడన నష్టం కారణంగా EOS-09 ఉపగ్రహాన్ని కోల్పోయింది.