ఏపీలో థియేటర్ల మూసివేత మళ్లీ మొదలుకాబోతోందా..?

Is the closure of theaters going to start again in AP. కొన్ని నెలల కిందట ఏపీలో థియేటర్ల సంక్షోభం మొదలైన సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  1 Oct 2022 12:00 PM GMT
ఏపీలో థియేటర్ల మూసివేత మళ్లీ మొదలుకాబోతోందా..?

కొన్ని నెలల కిందట ఏపీలో థియేటర్ల సంక్షోభం మొదలైన సంగతి తెలిసిందే..! థియేటర్లలో ప్రభుత్వం చెప్పిన నిబంధనలను పాటించాల్సిందేనని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక థియేటర్లలో అందించే సదుపాయాలను బట్టి కూడా టికెట్ ధరలపై నియంత్రణ విధించారు. ఒకానొక దశలో రాష్ట్రంలోని చాలా థియేటర్లు మూతబడ్డాయి. థియేటర్ల యాజమాన్యాలు థియేటర్లను కొన్ని వారాల పాటూ మూసి వేశారు. అయితే ఆ తర్వాత సినిమా పరిశ్రమ పెద్దలు వచ్చి.. ప్రభుత్వంతో మాట్లాడడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. థియేటర్లలో సదుపాయాలను మెరుగుపరచుకోవాలని.. అందుకు తగ్గట్టుగా టికెట్ల రేట్లను నిర్ణయించింది ప్రభుత్వం. ఇప్పుడు ఏపీలో పలు చోట్ల థియేటర్లపై అధికారులు దాడులు నిర్వర్తిస్తూ వస్తున్నారు.

బాపట్ల జిల్లాలో సినిమా థియేటర్లను నడిపించేందుకు ప్రభుత్వం నుంచి లైసెన్స్‌ తప్పనిసరి చేశారు. లైసెన్స్‌ పొందని సినిమా థియేటర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు పాలనాయంత్రాంగం సిద్ధమైంది. బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ కృష్ణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాపట్ల జిల్లావ్యాప్తంగా 39 సినిమా థియేటర్లు ఉండగా.. 15 థియేటర్లకు మాత్రమే లైసెన్సులు ఉన్నాయి. మిగిలిన థియేటర్లకు నోటీసులు ఇవ్వాలని అధికారులను కలెక్టర్‌ విజయకృష్ణ సూచించారు. 15 రోజుల్లోగా ఆయా థియేటర్ల యాజమాన్యాలు తమ లైసెన్స్‌ను పునరుద్ధరించనిపక్షంలో వాటిని మూసివేయాలని ఆమె ఆదేశించారు. లైసెన్స్‌ పునరుద్ధరణపై ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులు సినిమా థియేటర్ల యాజమాన్యాలతో చర్చించాలన్నారు.


Next Story