మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జ‌గ‌న్ కు ఆహ్వానం

Invitation to CM Jagan for Mahashivratri Brahmotsavam. శ్రీ కాళహస్తీశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజ‌రుకావాల్సిందిగా సీఎం జ‌గ‌న్‌ను

By Medi Samrat  Published on  10 Feb 2023 9:42 AM GMT
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జ‌గ‌న్ కు ఆహ్వానం

శ్రీ కాళహస్తీశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజ‌రుకావాల్సిందిగా సీఎం జ‌గ‌న్‌ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి, ట్రస్ట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ తారక శ్రీనివాసులు, ఈవో సాగర్‌ బాబు ఆహ్వానించారు. శుక్ర‌వారం ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన వారు ఆహ్వ‌న‌ప్ర‌తిని అంద‌జేసి ఆహ్వానించారు. వేదపండితులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు స్వామివారి తీర్ధప్రసాదాలు, శేషవస్త్రాలు, అందజేసి వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నెల 13 నుంచి 26 వరకు శ్రీ కాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.


Next Story