వైఎస్ భారతి రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 May 2024 5:16 AM GMTవైఎస్ భారతి రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సంచలన వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన భార్య వైఎస్ భారతిరెడ్డి పులివెందులలో ఆయన తరపున ప్రచారం చేస్తున్నారు. భర్త కోసం భారతి రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఏడు మండలాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించే బాధ్యతను ఆమె తీసుకున్నారు.
కొరీనా సురేస్, శ్రీ లక్ష్మి ముత్తేవితో జరిగిన సంభాషణలో వైఎస్ భారతి కీలక విషయాలను పంచుకున్నారు. జగన్ ప్రభుత్వ విజయాల గురించి, పులివెందుల ప్రజలకు- సీఎం జగన్ కు మధ్య వారధిగా ఎలా పనిచేస్తున్నారో సుదీర్ఘంగా మాట్లాడారు.
న్యూస్‌మీటర్: పులివెందులలో ఎన్నికల ప్రచారంలో మీకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారా?
భారతిరెడ్డి: నేను ప్రతి ఐదేళ్లకు ఒకసారి 2-3 వారాల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాను. మిగిలిన సమయాల్లో నేను ప్రజలతో అంతగా ఇంటరాక్ట్ అవ్వను. పులివెందుల నా స్వస్థలం కూడా. నెలకోసారి ఇక్కడికి వస్తాను. నేను వచ్చిన ప్రతిసారీ ప్రజలను కలుస్తాను. వారి ఎమ్మెల్యే తరపున పలు అంశాలను తెలుసుకుంటాను. ఇప్పుడు కూడా నేను ప్రచార సమయంలో ప్రజలను కలిసినప్పుడు, నా ముందు కొన్ని అభ్యర్థనలను తీసుకుని వస్తూ ఉంటారు. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నందున, ఎన్నికలు ముగిసిన తర్వాత వారి అవసరాలను పరిష్కరిస్తామని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. ప్రజలు పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ పథకం ప్రయోజనాలు, పిల్లలకు సహాయం మొదలైన సమస్యలను లేవనెత్తారు. వారు ఎక్కువగా వైద్య సంరక్షణ కోసం సహాయాన్ని అభ్యర్థిస్తూ ఉంటారు.
న్యూస్‌మీటర్: ఓ మంచి వ్యాపారవేత్తగా మీ అనుభవాన్ని బట్టి, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి, ఉత్పాదక ఉపాధిని పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి చేయాలి?
భారతి రెడ్డి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ ప్రభుత్వం దాదాపు 26,00,000 ప్రైవేట్ ఉద్యోగాలు, 6,00,000 ప్రభుత్వ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలను సృష్టించిందని నేను ఇటీవల ఒక వార్తాపత్రికలో ఒక కథనాన్ని చదివాను. ఈ రెండూ కలిపి గత ఐదేళ్లలో దాదాపు 30.32 లక్షల ఉద్యోగాలు సృష్టించినట్లే. ప్రభుత్వం కూడా MSMESకి ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తుంది. గత ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను వెంటనే ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం హామీల మేరకు అన్నీ సకాలంలో అందజేస్తుంది. ఈ ప్రోత్సాహకాలతో, MSME లు మూతపడే ముప్పును ఎదుర్కోవు. వారు ఉపాధిని సృష్టించగలరు.
రెండవది, AP ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రం. ఆక్వా కూడా సమృద్ధిగా ఉన్నందున, ఈ రంగాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించారు. ఉపాధి రేటును మరింత పెంచే నాలుగు పోర్టుల అభివృద్ధిని ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రభుత్వం సంపదను సృష్టించడానికి, ఉద్యోగాలను తీసుకుని రావడానికి ఫిషింగ్ హార్బర్‌లపై కూడా పని చేస్తున్నారు. మనకు హైదరాబాద్ లేదా బెంగళూరు వంటి నగరం లేదు, కానీ ఇచ్చిన వనరులు, మౌలిక సదుపాయాలలో, YSRCP ప్రభుత్వం ఉద్యోగాలను సృష్టించగలిగింది.
ప్రభుత్వానికి కేవలం మూడేళ్లు మాత్రమే (రెండేళ్ల కోవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని) పదవీకాలం ఉందని అన్నారు. తక్కువ సమయంలో చాలా ఎక్కువే చేశామని అంటున్నారు. నిర్దిష్ట పరిశ్రమల కోసం నైపుణ్యాభివృద్ధి సంస్థలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే టర్మ్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్శిటీని తీసుకురాబోతున్నారు.
న్యూస్‌మీటర్: వివిధ పథకాలలో పాఠశాలకు వెళ్లే పిల్లలు, పెన్షనర్‌లపై ఎక్కువ దృష్టి పెట్టారు. మిగిలిన వారి కోసం ఎలాంటివి తీసుకుని వచ్చారు.
భారతిరెడ్డి: జగన్ ప్రభుత్వం యువత, వృద్ధులతో పాటు మహిళలకు కూడా అండగా నిలుస్తోంది. స్త్రీ గర్భం దాల్చినప్పటి నుండి ఆరు సంవత్సరాల వరకు (ఆమె బిడ్డకు దాదాపు 6 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు) వారు జగనన్న సంపూర్ణ పోషణ ప్లస్‌కు అర్హులు. గర్భిణీ తల్లికి, బిడ్డకు ఆరేళ్ల పాటు మంచి, పౌష్టికాహారం అందజేస్తారు. ఆరు సంవత్సరాల తర్వాత, వారందరినీ మధ్యాహ్న భోజనం అందించే పాఠశాలలో చేర్పించారు. మధ్యాహ్న భోజన మెనూను ముఖ్యమంత్రి స్వయంగా రూపొందించారు. కాబట్టి ప్రతి రోజు వారికి వేరే వేరే మెనూ ఉంటుంది.
ఇంగ్లీషు మీడియం విద్యపై ఎక్కువ దృష్టి పెట్టారు. విద్యార్థులకు 8వ తరగతి నుంచి బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు అందించారు. వారు TOEFL శిక్షణను కూడా తీసుకోవచ్చు. వివిధ కోర్సుల కోసం EDXతో కూడా జతకట్టారు. MIT, LSE, Harvard మొదలైన విశ్వవిద్యాలయాల నుండి క్రెడిట్ కోర్సులు కూడా అందిస్తున్నారు. కాబట్టి పిల్లలకు విద్యపై చాలా చేస్తున్నారు. పని చేయలేని స్థితిలో ఉన్న వృద్ధులకు పింఛన్లు ఇస్తారు, తద్వారా వారు తమ బిడ్డల దయతో జీవించాల్సిన అవసరం లేదు. కాబట్టి వారికి నెలవారీ పింఛను ఇవ్వడం వల్ల వారి జీవితాన్ని గౌరవంగా గడపవచ్చు.
న్యూస్‌మీటర్: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మేనిఫెస్టోపై మీ అభిప్రాయం ఏమిటి? సంక్షేమ పథకాలను కొనసాగించారు. కొన్ని వాటిలో మెరుగుదల కూడా ప్రకటించారు. ఇంకా కొన్ని కొత్త వాగ్దానాలు ఉన్నాయి. మీ టేక్ ఏమిటి?
భారతి రెడ్డి: కొన్నివాటికి ఇది కొనసాగింపు, ఇంకొన్ని వాటికి చాలా వరకూ మెరుగుదల. అలాగే అమ్మ ఒడి, రైతు భరోసా విషయాల్లో దాదాపు రూ. 2000 మెరుగుదల ఉంది. చేయూత, ఈబీసీ నేస్తం వంటి ఇతరాలు అన్నీ కొనసాగింపుగా ఉన్నాయి.
న్యూస్‌మీటర్: ఒకవైపు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒంటరి పోరు.. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య మెగా పొత్తు కొనసాగుతోంది. ఈసారి అత్యంత కఠినమైన ఎన్నికలలో ఒకటిగా మారనుంది. సీఎంకు వ్యతిరేకంగా ఈ పొత్తును ఎలా చూస్తున్నారు?
భారతి రెడ్డి: ఒకరిపై ముగ్గురు పోరాడుతూ ఉన్నారంటే, అతడు బలవంతుడై ఉండాలి. కాబట్టి అతడిని ఒంటరిగా ఎదుర్కోలేమని ముగ్గురూ ఆలోచిస్తూ ఉండాలి. అందుకే వారంతా కలిసి వస్తున్నారు. అది గ్రౌండ్ రియాలిటీ అని తెలుసుకోవాలి.
న్యూస్ మీటర్: మీరు ఇద్దరు ముఖ్యమంత్రులను నిశితంగా చూశారు, ఒకరు మీ మామగారు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, మీ భర్త వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఇద్దరు మధ్య సారూప్యతలు మరియు తేడాలు ఏమిటి?
భారతిరెడ్డి: పులివెందుల విషయానికి వస్తే మా మామగారు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇద్దరికీ ప్రజల్లో ఎంతో అభిమానం ఉంది. మా మామగారు 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలా దాదాపు 45 ఏళ్లుగా కుటుంబ సభ్యుల్లో ఒకరు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు మూడు తరాల వారు.. తాతలు, పిల్లలు, ఇప్పుడు వారి పిల్లలు ఈ కుటుంబంతో అనుబంధం కలిగి ఉన్నారు.
కాబట్టి మాది బలమైన బంధం. సీఎం జగన్ 18 ఏళ్ల నుంచి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు.. ఇక్కడి ప్రజలతో ఆయనకు సన్నిహిత బంధం ఉంది. మా మామగారు మంచి నాయకుడు, ఆయనకు ప్రజలతో సన్నిహిత బంధం ఉండేది. నేను చాలా తేడాలు చెప్పలేకపోవచ్చు. ఇద్దరికీ ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధత ఉంది.. దాన్ని తప్పకుండా కొనసాగిస్తారని అనుకుంటూ ఉన్నాను.
న్యూస్ మీటర్: మీరు మీ రోజువారీ ప్రచారాన్ని ఎలా ప్లాన్ చేస్తారు?
భారతిరెడ్డి: పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడు మండలాలున్నాయి. ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నాను. తమ బృందం ఎక్కడెక్కడ ప్రచారం చేయాలో ప్లాన్ చేస్తుంది. సీఎంకు మద్దతివ్వాలని నేను ప్రజలను కోరుతున్నాను.. ప్రతి మండల పరిధిలోని చాలా ఇళ్లను కవర్ చేస్తామని హామీ ఇస్తున్నాం.