'పవన్‌ను చంద్రబాబే ఓడిస్తారేమో'.. ఎంపీ భరత్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పిఠాపురంలో చేదు అనుభవం తప్పదని ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. పొలిటికల్‌ ట్రాన్స్‌ఫర్‌లో భాగంగా పవన్‌ ఇక్కడికి వచ్చా? అని ప్రశ్నించారు.

By అంజి  Published on  15 March 2024 3:25 AM GMT
YCP, MP Bharat, Pawan kalyan, APnews, Pitapuram

'పవన్‌ను చంద్రబాబే ఓడిస్తారేమో'.. ఎంపీ భరత్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పిఠాపురంలో చేదు అనుభవం తప్పదని ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. పొలిటికల్‌ ట్రాన్స్‌ఫర్‌లో భాగంగా పవన్‌ ఇక్కడికి వచ్చా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడే ఇండిపెండెంట్‌ను నిలబెట్టి పవన్‌ను ఓడిస్తారేమో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి రాజకీయ పరిణామాలను జనసేన నేతలు లోతుగా పరిశీలించుకోవాలని సూచించారు.

పిఠాపురం శాసన సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నానని పవన్‌ కల్యాణ్‌ నిన్న ప్రకటించారు. జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ తో గెలిచి తీరుతామన్నారు. ప్రజలు పొత్తును ఆశీర్వదించి.. కూటమిని గెలిపించాలని కోరారు. శాంతి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్‌ అన్నారు. జగన్ అధికార దాహాంతో కొట్టుమిట్టాడుతున్నారని, సిద్ధం గ్రాఫిక్స్ లతో జగన్ అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు.

ఇప్పటి వరకు టీడీపీ-జనసేన కూటమి తరఫున జనసేన టికెట్‌ను తంగేళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, పిల్లా శ్రీధర్‌ ఆశించారు. టీడీపీ నుంచి వర్మ పోటీ చేయాలని భావించారు. అయితే, పవన్ పోటీ చేస్తానని ప్రకటించడంతో వారు సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి పవన్‌కు అపోనెంట్‌గా పోటీ చేసేది ఎవరా? అనే అంశంపై పడింది.

Next Story