అమరావతి: గ్రామ, వార్డు సచివాలయల ప్రక్షాళనలో భాగంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రోజూ తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్ ఆధారిత వేతన బిల్లులనే నమోదు చేయాలని సూచించింది. సచివాలయ ఉద్యోగుల్లో క్రమశిక్షణ పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు సచివాలయాల శాఖ నుండి కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.
అలాగే ఇటీవల విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్ - 2047 ఫ్రేమ్ వర్క్ బాధ్యతల్లోనూ పాలుపంచుకోవాలని పేర్కొంది. దీనిపై సీఎం ప్రతి శుక్రవారం నిర్వహించే సమీక్షలో ఆర్టీజీఎస్‌తో పాటు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు కూడా పాల్గొనాలని తెలిపింది. జీఎస్ డబ్ల్యూఎస్ యాప్ లో పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకూ, వీఆర్వో గ్రేడ్ 1 ఇలా హాజరు వేయడం లేదని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.