మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలివే..

Implementation dates of government programs and schemes in the months of March and April. సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌ సమావేశమ‌య్యారు.

By Medi Samrat  Published on  7 March 2023 12:49 PM
మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలివే..

government schemes


సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌ సమావేశమ‌య్యారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు, మార్చి, ఏప్రిల్‌ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలుచేయాల్సిన పథకాల తేదీలను ఖరారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా పలు కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఎన్నికల కోడ్‌ ముగియనుండడంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10 నుంచి మధ్యాహ్న భోజనంతో పాటుగా రాగిజావ అమలు ప్రారంభించ‌నుంది.

మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. బీఏసీ సమావేశంలో సమావేశాల షెడ్యూలు ఖరారు చేయ‌నున్నారు. ఇక ప‌థ‌కాల విష‌యానికొస్తే.. మార్చి 18 సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం.. జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో నగదు జమ చేయ‌నున్నారు. మార్చి 22న ఉగాదిరోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటించ‌నున్నారు. వీరికి ఏప్రిల్‌ 10న అవార్డులు, రివార్డులు అంద‌జేస్తారు.

మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం ఉంటుంది. మార్చి 25 నుంచి వైయస్సార్‌ ఆసరా ప్రారంభ‌మై.. ఏప్రిల్‌ 5 వరకూ కొనసాగుతుంది. మార్చి 31న జగనన్న వసతి దీవెన, ఏప్రిల్‌ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు, ఏప్రిల్‌ 10న వాలంటీర్లకు సన్మానం, ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం కార్య‌క్ర‌మాలు ఉంటాయి.


Next Story