ఆ శాఖ‌ల మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జ‌గ‌న్‌

CM Jagan congratulated ministers and officers. మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్ జరిగింది.

By Medi Samrat  Published on  7 March 2023 9:27 AM GMT
ఆ శాఖ‌ల మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జ‌గ‌న్‌

CM Jagan congratulated ministers and officers


విశాఖ‌ప‌ట్నంలో ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ విజయవంతం అవ‌డంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభినందించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్‌ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ ఎండీ ఎస్‌.షన్‌మోహన్ పాల్గొన్నారు.

మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్ జరిగింది. రెండు రోజుల స‌మావేశాల ద్వారా రాష్ట్రానికి రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయ‌ని, 378 ఒప్పందాలు కుదుర్చుకున్నామ‌ని, త‌ద్వారా 6.09 లక్షల మందికి ఉపాధి పొంద‌నున్నార‌ని సీఎం ప్ర‌క‌టించారు. ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ ప్రతి వారం సమావేశమై.. సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం.. మంత్రులు, అధికారులకు సూచించారు.


Next Story