బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. బుధవారం నాడు తీవ్ర అల్పపీడనగా మారంది. ఇది కోస్తా తీరం వైపు దూసుకొస్తుంది. రానున్న 24 గంటల్లో ఉత్తమ తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనుంది. ఆ తర్వాత తీరం వెంబడి కదలనుంది. దీని ఎఫెక్ట్‌తో రేపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతవరణ కేంద్రం తెలిపింది. నేడు విజయనగరం, అనకాపల్లి, విశాఖ, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
శ్రీకాకుళం, అల్లూరి సీతరామరాజు, నెల్లూరు, తిరుపతి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రేపు పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురొవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో సముద్రం అలజడిగా ఉందని, ఈ క్రమంలోనే ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు..