అలర్ట్‌.. ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు నెల్లూరు, సత్యసాయి, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

By అంజి  Published on  26 Nov 2024 8:37 AM IST
IMD , heavy rains, Andhrapradesh, APSDM

అలర్ట్‌.. ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు

అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు నెల్లూరు, సత్యసాయి, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశంలో మూడు రోజులు వానలు ఉంటాయని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలన్నారు. దక్షిణకోస్తా తీరం వెంబడి నేడు గంటకు 50-70కిమీ, రేపటి నుంచి 55 -75కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. వర్షాల నేపధ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రానున్న నాలుగు రోజులు వాతావరణం క్రింద లింక్లో విధంగా ఉండే అవకాశం ఉందని వివరించారు.

Next Story