బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం
IMD Issues Cyclone Alert For Odisha and Andhra Pradesh.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రవాయుగుండంగా
By తోట వంశీ కుమార్ Published on
25 Sep 2021 7:14 AM GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రవాయుగుండంగా మారింది. శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి వాయుగుండగా మారిందని.. శనివారం ఉదయం 5.30గంటలకు అది తీవ్రవాయుగుండగా మారిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం అది ఉత్తర, తూర్పు మధ్య బంగాళాఖాతంలో.. గోపాల్‌పూర్‌కు 510 కిలోమీటర్ల దూరంలో కలింగపట్నానికి 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.
రాగల 24గంటల్లో అది మరింత బలపడి తుఫానుగా మారనుండగా.. దీనికి గులాబ్‌గా నామకరణం చేయనున్నారు. ఆదివారం సాయంత్రానికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్షం ఉన్నట్లు సూచించింది.గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఆ గాలుల వేగం రేపటికి 75 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని.. వెళ్లిన వారు వెంటనే తిరిగొచ్చేయాలని సూచించారు.
Next Story