తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, రుతుపవనాల రాక.. ఐఎండీ ఏమని చెప్పిందంటే?

వచ్చే నాలుగు వారాల్లో భారతదేశంలో రుతుపవనాలు మందకొడిగా ఉంటాయని, వ్యవసాయంపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలను

By అంజి  Published on  13 Jun 2023 11:18 AM IST
IMD, monsoon, Telugu states, Weather alert, APnews, Telangana

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, రుతుపవనాల రాక.. ఐఎండీ ఏమని చెప్పిందంటే?

వచ్చే నాలుగు వారాల్లో భారతదేశంలో రుతుపవనాలు మందకొడిగా ఉంటాయని, వ్యవసాయంపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలను ప్రైవేట్‌ ఫోర్‌కాస్టింగ్ ఏజెన్సీ స్కైమెట్ వెదర్ సోమవారం అంచనా వేసింది.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో రెండు రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో ఒకరోజు వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శాస్త్రవేత్తలు సోమవారం తెలిపారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త శ్రావణి విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తుయన్నారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం ద్రోణి ఉన్నట్లు కనిపిస్తోంది. గత 24 గంటలుగా రాష్ట్రవ్యాప్తంగా నైరుతి, వాయువ్య గాలులు వీస్తున్నాయి. ఇది రాగల 24 గంటల్లో ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో కొనసాగనుంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఆమె తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మెదక్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలో కూడా ఉష్ణోగ్రతలు ఎడతెరిపి లేకుండా పెరుగుతున్నాయని ఆమె తెలిపారు.

''ఈ సమయంలో సాధారణ ఉష్ణోగ్రత 36-38 డిగ్రీలు ఉండాలి. కానీ 40-41 డిగ్రీలకు చేరుకోవడం రాష్ట్రవ్యాప్తంగా అసౌకర్యాన్ని సృష్టిస్తోంది. రాబోయే 24 గంటల్లో ఇదే విధమైన వాతావరణాన్ని ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురు గాలులు వీస్తాయని, మధ్య భాగంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది'' అని ఆమె తెలిపారు. ''హైదరాబాద్‌లో, పట్టణ పరిసరాల కారణంగా రాబోయే రెండు రోజులు 38-40 డిగ్రీల ఉష్ణోగ్రత, వేడి గాలులు వీస్తాయి. ఆ తరువాత, ఉష్ణోగ్రత తగ్గుతుంది. సాయంత్రం ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది'' అని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లోని దక్షిణ ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములతో కూడిన ఈదురు గాలులు రానున్న 2-3 రోజుల పాటు కొనసాగుతాయని శ్రావణి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల దక్షిణ ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమల్లో రానున్న 2-3 రోజుల్లో రుతుపవనాల వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అంచనా వేయబడింది. ఇది సాధారణ వాతావరణ పరిస్థితులకు దారితీస్తుందని శాస్త్రవేత్త శ్రావణి చెప్పారు. అలాగే, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన గాలివానలు ఉంటాయి.

రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయి. రేపటి నుండి హీట్‌వేవ్ పరిస్థితులు తగ్గుతాయి ఎందుకంటే ఇప్పటికే రుతుపవనాల ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ ప్రాంతాలలో ఉంది. మరో 2-3 రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌కు చేరుకుంటుంది. సోమవారం శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశించగా, మంగళవారం అనంతపురం, నెల్లూరు జిల్లాలను తాకే అవకాశం ఉంది. జూన్ 18 నాటికి రుతుపవనాలు ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశాలోకి ప్రవేశిస్తాయి. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు మరో వారం రోజులు పట్టవచ్చు.

IMD-అమరావతి ప్రాంతం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో గత తొమ్మిదేళ్లలో (2014 నుండి 2022 వరకు) జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఏడు సార్లు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. "ఈ సంవత్సరం, 2023లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయబడింది. జూన్ చివరి వారంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం కార్యకలాపాలు జరుగుతాయి. జూన్‌లో సాధారణ వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది" అని IMD శాస్త్రవేత్త డాక్టర్ కరుణ సాగర్ చెప్పారు. 2022లో రుతుపవనాలు జూన్ 13న ఆంధ్రప్రదేశ్‌కి వచ్చాయి. జూన్ 20న ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్‌ని కవర్ చేసింది. 2022లో రాష్ట్రం 575.6 మిమీ వర్షపాతం నమోదు చేసింది, ఇది సాధారణ 514 మిమీ కంటే 10% ఎక్కువ.

IMD ప్రకారం, నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడినప్పటికీ భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

Next Story