వైసీపీ నేత జోగి రమేశ్‌పై కేసు నమోదు.. వైఎస్ జగన్ ఫోన్

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.

By -  అంజి
Published on : 2 Feb 2026 11:10 AM IST

Ibrahimpatnam, police have registered a case, former minister Jogi Ramesh, YSRCP, APnews

వైసీపీ నేత జోగి రమేశ్‌పై కేసు నమోదు.. వైఎస్ జగన్ ఫోన్ 

మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా జోగి రమేశ్‌వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. రమేశ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు.

మాజీ మంత్రి జోగి రమేష్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌ చేశారు. జోగి రమేష్‌ను పరామర్శించిన వైఎస్‌ జగన్‌ జోగి రమేష్‌ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న ఆయన.. ప్రశ్నించేవారిని భయపెట్టడానికే చంద్రబాబు హింసాజ్వాలను రాజేస్తున్నారని మండిపడ్డారు. అవే మంటలు చంద్రబాబు సర్కార్‌ను దహించి వేయక తప్పదన్నారు.

Next Story