ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీలు చేసింది. కొందరిని జీఏడీకి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

By Medi Samrat
Published on : 19 Jun 2024 8:41 PM IST

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీలు చేసింది. కొందరిని జీఏడీకి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవను, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ను జీఏడీకి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సీఆర్‌డీఏ కమిషనర్‌: కాటమేని భాస్కర్‌

ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి: సౌరభ్‌గౌర్‌

సీఎం సెక్రటరీ: ప్రద్యుమ్న

ఆర్థిక శాఖ కార్యదర్శి: వినయ్‌ చంద్‌

ఉద్యాన, మత్స్య, సహకారశాఖ కార్యదర్శి: అహ్మద్‌బాబు

పశు సంవర్థకశాఖ కార్యదర్శి: ఎంఎం నాయక్‌

కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి: గోపాలకృష్ణ ద్వివేది

పౌర సరఫరాల శాఖ కమిషనర్‌: సిద్ధార్థ్‌ జైన్‌

పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి: అనిల్‌కుమార్‌ సింఘాల్‌

పాఠశాల కార్యదర్శి: కోన శశిధర్‌ (ఐటీ, ఆర్టీజీఎస్‌ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు)

గనుల శాఖ డైరెక్టర్‌: ప్రవీణ్‌కుమార్‌(ఏపీఎండీసీ ఎండీగా అదనపు బాధ్యతలు)

జలవనరుల శాఖ స్పెషల్‌ సీఎస్‌: జి.సాయి ప్రసాద్‌

పంచాయతీ రాజ్‌ ముఖ్యకార్యదర్శి: శశిభూషణ్‌

వ్యవసాయ ముఖ్యకార్యదర్శి: రాజశేఖర్‌

Next Story