ఆ సర్వే మేము చేయలేదు : ఐ-ప్యాక్
ఏపీలో తాము చేసిన సర్వే అంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ఐప్యాక్ సంస్థ తెలిపింది.
By Medi Samrat Published on 31 Aug 2023 3:11 PM GMTఏపీలో తాము చేసిన సర్వే అంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ఐప్యాక్ సంస్థ తెలిపింది. ఏపీలోని ఒక మీడియా చానల్ ఒక ఫేక్ సర్వేను తమదంటూ ప్రచారం చేసిందని చెప్పుకొచ్చింది. తాము ఎన్నికల సర్వేలను నిర్వహించమనే విషయం తమ రికార్డును చూస్తే అర్థమవుతుందని.. ఐప్యాక్ సర్వే అంటూ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ వచ్చే వార్తలన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పింది. కొందరు వ్యక్తులు కానీ, గ్రూపులు కానీ చేస్తున్న పని ఇదని తెలిపింది.
ఐప్యాక్ సంస్ధ అధికారికంగా ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మీడియా ఛానెల్ ఐ-ప్యాక్ కు లింక్ చేస్తూ ఫేక్ సర్వేను షేర్ చేసిందని, రికార్డును సరిగ్గా సెట్ చేద్దామని, ఐప్యాక్ ఎలాంటి సర్వేలను నిర్వహించదని పేర్కొంది. మీడియా/సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తమకు ఆపాదించిన ఏదైనా సర్వే పూర్తిగా అవాస్తవమని తెలిపింది.
ఐప్యాక్ ఇచ్చిందంటూ ప్రచారం చేస్తున్న ఆ సర్వే రిపోర్టులో వైసీపీకి మూడు ఎంపీ సీట్లలోనే స్పష్టమైన ఆధిక్యం ఉందట. మరో మూడు, నాలుగు సీట్లలో హోరాహోరీ కొనసాగుందన్నారు. మిగిలిన 15పైగా సీట్లలో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉందని వైసీపీ పెద్దలకు ఐప్యాక్ సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లు ఓ ఛానల్ కథనాలను ప్రచారం చేసింది.