'ఇళ్లపట్టాల పేరుతో రూ.2 లక్షల కోట్ల స్కామ్'.. ఎమ్మెల్యే బండారు సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.

By అంజి
Published on : 14 Nov 2024 12:01 PM IST

house titles, MLA Bandaru Satyanarayana Murthy, APnews, Vizag

'ఇళ్లపట్టాల పేరుతో రూ.2 లక్షల కోట్ల స్కామ్'.. ఎమ్మెల్యే బండారు సంచలన ఆరోపణలు

అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో గత ప్రభుత్వం భారీ స్కామ్‌ చేసిందన్నారు. వైసీపీ హయాంలో ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై ఈ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి విశాఖలోనే రూ.40,000 కోట్లు దోచేశారన్నారు. దీనిపై సిట్టింగ్‌ జడ్జితో విచారించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ జిల్లాలో జరిగిని అవినీతిని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే తెలిపారు. తాను అవినీతిని నిరూపించలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు. ఏ శిక్ష విధించినా అందుకు బాధ్యత వహిస్తానని ఎమ్మెల్యే బండారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.

Next Story