అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో తన మాట వినలేదనే కారణంతో కన్న కూతురునే తండ్రి రామాంజనేయులు కిరాతకంగా చంపేశాడు. కసాపురం గ్రామంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అనంతరం కసాపురం శివారు ఫారెస్ట్ ఏరియాలో మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కాగా గ్రామ శివారులో ఓ యువతి దారుణ హత్యకు గురైన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికుల సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విచారణలో సంచలన విషయం తెలిశాయి. గ్రామానికి చెందిన తుపాకుల రామాంజనేయులు చిన్న కూతురు భారతి ప్రేమలో పడింది. అయితే, ప్రేమించిన వాడు వేరే కులం వాడు కావడంతో ఇంట్లో వాళ్లు భారతిని మందలించారు. అయినా యువతి మాట వినకపోవడం ఎక్కడ విషయం బయటపడుతుందోనని అనుకున్న తండ్రి రామాంజనేయులు కూతురిని ఇంట్లోనే కొట్టి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఊరు బయట కొండ ప్రాంతానికి తీసుకెళ్లి డెడ్‌బాడీపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ నెల 1వ తేదీన ఘటన జరగగా నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.