ఇల్లు లేని వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి లక్ష గృహప్రవేశాలు

సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు.

By అంజి  Published on  5 Nov 2024 6:34 AM IST
Homes, CM Chandrababu, APnews, Housing Department

అర్హులందరికీ ఇళ్లు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 పథకం ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పీఎంఏవై అర్బన్‌ కింద 58,578 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణం కింద 17,197 ఇళ్లు నిర్మించినట్టు అధికారులకు సీఎం చంద్రబాబుకు వివరించారు.

ఈ ఏడాది చివరినాటికి లక్ష ఇళ్లు పూర్తవుతాయని చెప్పారు. లబ్ధిదారులకు ఇంటి తాళాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 2026 నాటికి మరో 7.60 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. డ్రోన్ల ద్వారా ఇళ్ల నాణ్యత, కొలతలు తీసుకునేందుకు గృహ నిర్మాణ శాఖ పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలపగా.. పెద్ద లే అవుట్లలో కూడా ఇదే సాంకేతికతను వినియోగించాలని సీఎం సూచించారు. 597 మందిని డిప్యుటేషన్‌ ద్వారా గృహ నిర్మాణ శాఖలోకి తీసుకునేందుకు చంద్రబాబు ఆమోదముద్ర వేశారు.

Next Story