ఇంకా పాత వాసన బాగా ఉంది.. అధికారులపై హోం మంత్రి ఆగ్రహం
పాయకరావుపేట పట్టణంలో పంచాయితీ రాజ్ ప్రభుత్వ గెస్ట్ హౌస్ వద్ద ఏడాది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు.
By Kalasani Durgapraveen Published on 1 Nov 2024 12:29 PM GMTపాయకరావుపేట పట్టణంలో పంచాయితీ రాజ్ ప్రభుత్వ గెస్ట్ హౌస్ వద్ద ఏడాది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. అనంతరం హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం-మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అన్నారు. ప్రధాని మోదీ, సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదు సంవత్సరాలగా గ్యాస్ పొయ్య వెలిగించాలి అంటే మహిళలు భయపడేవారన్నారు. గతంలో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి-ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారన్నారు.
అప్పటిలో మహిళల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు దీపం పథకం ప్రవేశపెట్టారన్నారు. ఇప్పుడు మరల దీపం-2 పథకం ప్రవేశపేట్టి, మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం అన్నారు. రాష్ట్ర ఖజనాలో ప్రస్తుతం డబ్బులు జీరో. త్వరలో పాయకరావుపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభింస్తాం అని తెలిపారు . పాయకరావుపేట నియోజకవర్గంలో మేము వేసిన రోడ్లు తప్ప-ఒక్క రోడ్డు వేయలేదన్నారు. త్వరలో పాయకరావుపేటలో డబుల్ రోడ్డు వేస్తాం హామీ ఇచ్చారు .
పాయకరావుపేటకు ఒక గుర్తింపు తీసుకువస్తాం అన్నారు. వైసిపి పాలనలో గ్రామ సర్పంచ్ లకు చేతులకు సంకేళ్ళు వేసారు. ఏన్డీయే ప్రభుత్వంలో గ్రామాలు అభివృధ్ధి చెందుతున్నాయి అన్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోం మంత్రి వంగలపూడి అనిత అధికారుల్లో ఇంకా పాత వాసన బాగా ఉంది అన్నారు. అధికారులు నిర్లిప్తత వీడండి అన్నారు. నేను ఎక్కడ ఉన్నా ఏ అధికారి ఎలా పని చేస్తున్నారో డేటా ఉంటుందన్నారు. నేను ఎప్పుడు అధికారులను సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోలేదన్నారు. అలాంటి పరిస్థితిని తీసుకురాకండి.. అధికారులు తప్పు చెస్తే-ఉపేక్షించేంది లేదన్నారు. ఎవ్వరైనా అధికారులు అవినీతి చేస్తే-తక్షణమే చర్యలు తీసుకుంటాం అన్నారు.