Andhra Pradesh : పిల్లల ముందు మహిళతో అశ్లీల నృత్యాలు.. హోంగార్డు సస్పెండ్..

చిన్నారుల ముందు అశ్లీల నృత్యం చేసిన హోంగార్డుపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కఠిన చర్యలు తీసుకున్నారు.

By -  Medi Samrat
Published on : 25 Nov 2025 7:40 PM IST

Andhra Pradesh : పిల్లల ముందు మహిళతో అశ్లీల నృత్యాలు.. హోంగార్డు సస్పెండ్..

చిన్నారుల ముందు అశ్లీల నృత్యం చేసిన హోంగార్డుపై కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కఠిన చర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా జిల్లాలో హోంగార్డుగా పనిచేస్తున్న అజయ్ కుమార్ ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ డీజే పాటలకు ఓ యువతితో కలిసి చిన్నారుల ఎదుటే అసభ్యకరంగా నృత్యం చేశాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు తీవ్రంగా స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, హోంగార్డు క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. తక్షణమే అజయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Next Story