హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం..పద్మభూషణ్ తనలో కసి పెంచిందన్న బాలయ్య

అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక ఉత్రంఠకు తెరపడింది. గత రెండ్రోజుల నుంచి క్యాంప్ పాలిటిక్స్ అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎన్నిక నిర్వహించగా.. టీడీపీ అభ్యర్థి రమేష్‌కు అనుకూలంగా 23 ఓట్లు పడ్డాయి.

By Knakam Karthik  Published on  3 Feb 2025 1:26 PM IST
Andrapradesh, Hindupuram municipality was won by TDP, Mla Balakrishna, Tdp, Ysrcp

హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం..పద్మభూషణ్ తనలో కసి పెంచిందన్న బాలయ్య

అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక ఉత్రంఠకు తెరపడింది. గత రెండ్రోజుల నుంచి క్యాంప్ పాలిటిక్స్ అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎన్నిక నిర్వహించగా.. టీడీపీ అభ్యర్థి రమేష్‌కు అనుకూలంగా 23 ఓట్లు పడ్డాయి. అలాగే వైసీపీ అభ్యర్థిని లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో టీడీపీ అభ్యర్థి రమేష్ గెలుపొందగా.. హిందూపురం మున్సిపల్ నూతన ఛైర్మన్‌గా రమేష్ ఎన్నికయ్యారు. అయితే గతంలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచిన పలువురు కార్పొరేటర్లు.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. దీంతో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల పదికి ఎన్నిక అనివార్యమైంది.

ముందుగా.. హిందూపురంలో 144 సెక్షన్‌, సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేశారు. ఎన్నిక నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మకాం వేసి చక్రం తిప్పాడు. పెనుకొండలోని ఓ రిసార్ట్‌‌లో కౌన్సిలర్లను ఉంచి ఈ రోజు ఉదయం.. హిందూపురం తీసుకొచ్చారు. మున్సిపల్ కమిషనర్ ఓటింగ్ నిర్వహించగా.. అనంతరం 23 అనుకూల ఓట్లు సాధించిన టీడీపీ కౌన్సిలర్ రమేష్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం రమేష్ ను ఎమ్మెల్యే బాలకృష్ణ.. చైర్మన్ సీట్లో కూర్చోబెట్టాడు. ఈ క్రమంలో పార్టీ మారిన వైసీపీ కౌన్సిలర్లకు వ్యతిరేకంగా వైసీపీ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. అయితే టీడీపీ తమ పార్టీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిందని.. కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. ఈ క్రమంలో టీడీపీ కౌన్సిలర్లు సైతం వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో హిందూపురం మున్సిపల్ కార్యాలయ ప్రాంతం మొత్తం జై బాలయ్య నినాదాలతో మార్మోగిపోయాయి.

టీడీపీ అభ్యర్థి మేయర్‌గా విజయం సాధించడం పట్ల హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియా సమావేశంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీతో విసిగి చెందిన కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. హిందూపురంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని.. పద్మభూషణ్ అవార్డు తనలో కసి పెంచిందన్నారు. నాకెవరూ ఛాలెంజ్ కాదు.. నాకు నేనే ఛాలెంజ్ అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తుందని ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ కీలక కామెంట్స్ చేశారు.

Next Story