మడకశిరలో ఉద్రిక్తత

తాజాగా టీడీపీ ఐదుచోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మార్చింది. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి, ఉండి టికెట్‌ రఘురామకృష్ణరాజు, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టికెట్‌ను

By Medi Samrat  Published on  21 April 2024 7:34 PM IST
మడకశిరలో ఉద్రిక్తత

తాజాగా టీడీపీ ఐదుచోట్ల అసెంబ్లీ అభ్యర్థులను మార్చింది. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి, ఉండి టికెట్‌ రఘురామకృష్ణరాజు, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్‌ సునీల్‌కుమార్‌ పేరును ఇంతకు ముందు ప్రకటించగా ప్రస్తుతం ఎమ్మెస్‌ రాజుకు కేటాయించారు. మాడుగుల టికెట్‌ బండారు సత్యనారాయణమూర్తి కి అవకాశం కల్పించారు. వెంకటగిరికి సంబంధించి రామకృష్ణకు బీ ఫారమ్‌ను ఇచ్చింది టీడీపీ.

టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం మాజీ ఎమ్మెల్యే ఈరన్న వర్గానికి కోపం తెప్పించింది. మొదట సునీల్ కుమార్‌కు టికెట్ ఇచ్చినట్లు ప్రకటించిన టీడీపీ.. ఇప్పుడు ఎమ్మెస్ రాజుకు బీఫాం ఇవ్వడంతో.. ఈరన్న వర్గీయులు మండిపడుతున్నారు. మడకశిర టీడీపీ ఆఫీసు దగ్గర ఫ్లెక్సీలు చించివేసి ఆందోళన చేశారు. చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు. ఎమ్మెస్ రాజు గో బ్యాక్ అంటూ సునీల్ వర్గీయులు నినాదాలు చేశారు. టీడీపీ జెండాలు దహనం చేశారు.

Next Story