చంద్రబాబుపై రాళ్ల దాడి

High Tension at Yerragondapalem over TDP Chief Chandrababu tour. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on  22 April 2023 2:00 AM GMT
చంద్రబాబుపై రాళ్ల దాడి

High Tension at Yerragondapalem over TDP Chief Chandrababu tour


ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు వాహనంపై దుండగలు రాళ్ల దాడి చేయడంతో చంద్రబాబు భద్రతా సిబ్బందిలో ఒకరి తలకు గాయాలయ్యాయి. ఈ దాడికి తెగబడింది వైసీపీ కార్యకర్తలేనని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దళితద్రోహి చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని యర్రగొండపాలెం వస్తారంటూ ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు.

యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు రాళ్ల దాడికి తెగబడ్డారు. ఒక్కసారిగా రాళ్లు రువ్వడంతో చంద్రబాబు సెక్యూరిటీలోని ఎన్ఎస్జీ కమాండెంట్‌ సంతోష్ కుమార్ తలకు గాయమైంది. ప్రకాశం జిల్లాలో మూడ్రోజులుగా చంద్రబాబు పర్యటిస్తున్నారు.


Next Story