పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పిల్.. మాజీ ఎంపీకి హైకోర్టు షాక్‌..!

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో మాజీ ఎంపీ హర్షకుమార్‌కు హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది.

By Medi Samrat
Published on : 19 Jun 2025 11:45 AM IST

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పిల్.. మాజీ ఎంపీకి హైకోర్టు షాక్‌..!

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో మాజీ ఎంపీ హర్షకుమార్‌కు హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ ఎంపీ హర్షకుమార్ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరపు న్యాయవాది బి. బాల వాదనలు వినిపిస్తూ, పాస్టర్ ప్రవీణ్ మరణంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ధర్మాసనం ప్రవీణ్ హత్యకు గురయ్యాడనేందుకు ఆధారాలు ఉన్నాయా అని పిటిషనర్ హర్షకుమార్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. మద్యం దుకాణం వద్ద ప్రవీణ్ ఉన్నట్లు ఫోటోలు, ఆ తర్వాత వాహనం నడిపినట్లు ఆధారాలు ఉన్నాయని, ఆ రెండు చర్యలు ప్రమాదకర కలయిక అని తెలిపింది. పిల్ వేయడానికి పిటిషనర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు కారు కదా అని ప్రశ్నించింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై రెండు పిల్‌లు దాఖలై ఉండగా, మరో పిల్ వేయాల్సిన అవసరం ఏముందని కూడా ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్ట్రీ వద్ద రెండు వారాల్లో రూ.5 లక్షలు జమ చేయాలని హర్షకుమార్‌ను ఆదేశించింది. సొమ్ము జమ చేసిన తర్వాత పిల్‌పై విచారణ జరుపుతామని తెలిపింది.

Next Story