ఆనందయ్య 'కె' మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
High Court Green Signal To Anandaiah Corona Medicine. నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య 'కె' మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By Medi Samrat Published on
7 Jun 2021 9:38 AM GMT

నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య 'కె' మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆనందయ్య 'కె' మందును ఇప్పటికే నిపుణుల బృందం పరిశీలించిన నేఫథ్యంలో.. ఆ మందును వెంటనే బాధితులకు పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే.. కంట్లో వేసే చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక అందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఇదిలావుంటే.. ఆనందయ్య తయారుచేసే పీ, ఎఫ్, ఎల్ మందులకు అనుమతి ఇచ్చిన న్యాయస్థానం.. కంట్లో వేసే చుక్కల మందుకు అనుమతి ఇవ్వలేదు. 'కె' మందుకు కూడా నాడు అనుమతి ఇవ్వలేదు. తాజాగా వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం 'కె' మందు పంపిణీకి ఎలాంటి అభ్యంతరాల్లేవని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
ఇదిలావుంటే.. సోమవారం గొలగమూడిలో ఆనందయ్య మందు పంపిణీని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజుకి 2 వేల నుంచి 3 వేలమందికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని తెలిపారు. దీంతో సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని చెప్పిన ఆనందయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
Next Story