ఇంటికి రూ.25,000.. ఏపీ ప్రభుత్వం ఆర్థికం సాయం వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. కిరాణా షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25 వేలు ఇస్తామన్నారు.

By అంజి  Published on  18 Sep 2024 1:04 AM GMT
AP government, financial assistance, flood victims, APnews

ఇంటికి రూ.25,000.. ఏపీ ప్రభుత్వం ఆర్థికం సాయం వివరాలు

ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం ప్రకటించారు. విజయవాడలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ మునిగిన వారికి రూ.25 వేలు, ఫస్ట్‌, ఇతర ఫోర్లు మునిగిన వారికి రూ.10 వేల చొప్పున సాయం చేస్తామని వెల్లడించారు. కిరాణా షాపులు, ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి రూ.25 వేలు ఇస్తామన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు.

179 సచివాలయాల పరిధిలో ఇంటికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నామని, చరిత్రలో తొలిసారి ఇంటికి రూ.25 వేలు సాయం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. టూ వీలర్స్‌ దెబ్బతింటే రూ.3 వేలు, త్రీవీలర్స్‌ దెబ్బతింటే రూ.10 వేలు ఇస్తామన్నారు. అలాగే తోపుడు బండ్లు దెబ్బతింటే కొత్త బండ్లు ఇస్తామన్నారు. చేనేత కార్మికులకు రూ.15 వేల నుంచి రూ.25 వేలు ఇస్తామని, గేదెలు మరణిస్తే రూ.50 వేలు, ఎద్దులు మరణిస్తే రూ.40 వేలు, పంట నష్టం వరి ఎకరాకు రూ.10 వేలు, మిరప హెక్టారుకు రూ.35 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.

అటు రాష్ట్రానికి కేంద్రం నుంచి వరద సాయంపై ఇప్పుడే చెప్పలేమని సీఎం చంద్రబాబు అన్నారు. ముందుగానే అంచనా వేయడం సరికాదని, వచ్చాక వెల్లడిస్తామని తెలిపారు. విద్యార్థులకు అన్ని పుస్తకాలు అందిస్తామని తెలిపారు. వరదల్లో సర్టిఫికెట్లు పొగొట్టుకున్న వారికి తిరిగి అన్నీ అందిస్తామన్నారు. స్టడీ మాత్రమే కాకుండా ల్యాండ్‌, రేషన్‌, కార్డుల వంటివి కూడా అందజేస్తామని పేర్కొన్నారు.

Next Story