మరో 4 రోజులు భారీ వర్షాలు..!

Heavy Rains next 4 Days in AP.తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్ప‌డ‌నున్న అల్పపీడన ప్రభావంతో రాగ‌ల నాలుగు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Sep 2021 6:16 AM GMT
మరో 4 రోజులు భారీ వర్షాలు..!

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్ప‌డ‌నున్న అల్పపీడన ప్రభావంతో రాగ‌ల నాలుగు రోజులు ఉత్త‌రాంధ్ర‌తో పాటు ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ వెల్ల‌డించింది. స‌ముద్ర మ‌ట్టానికి 7.6కిలోమీట‌ర్ల ఎత్తులో ఉప‌రితల ఆవ‌ర్త‌నం ఆవ‌రించి ఉంద‌ని చెప్పింది. మధ్య బంగాళా ఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో శనివారం నుండి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఉత్తరాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని సూచించింది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55 -65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఒడిశాతో పాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోని మత్స్యకారులు మంగళవారం వరకు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో శ‌నివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జ‌ల్లులు ప‌డే అవ‌కాశం ఉంది.

Next Story