ఏపీలో మూడు రోజులు భారీ వ‌ర్షాలు.. వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌..!

నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 100 కిమీ, నాగపట్నానికి 320 కి.మీ, పుదుచ్చేరికి 410 కి.మీ మరియు చెన్నైకి 490 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది.

By అంజి
Published on : 28 Nov 2024 8:34 AM IST

Heavy rains, APnews, Meteorological Department

Heavy rains for three days in AP.. Meteorological Department warns

నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం స్థిరంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 100 కిమీ, నాగపట్నానికి 320 కి.మీ, పుదుచ్చేరికి 410 కి.మీ మరియు చెన్నైకి 490 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. ఇది రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది ఉత్తర-వాయువ్య దిశగా పయనించి శనివారం (నవంబర్ 30వ తేదీ) ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో మూడు రోజులు (28-30) దక్షిణకోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీవర్షాలు.. మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 35-45 కి.మీ గరిష్టంగా 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయ‌ని విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ హెచ్చించారు.

Next Story