నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ

తాజా వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు ఎండ వేడిమి

By అంజి  Published on  1 May 2023 10:00 AM IST
Heavy rains , Meteorological department, Andhrapradesh

నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ

అమరావతి: తాజా వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు ఎండ వేడిమి నుండి చాలా ఉపశమనం పొందారు. సోమ, మంగళవారాల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో అకాల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఉదయం నుంచి అనంతపురం, కర్నూలు, నంద్యాల, గుంటూరు, కాకినాడ, గోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. విశాఖపట్నంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

పిడుగులు పడే సమయంలో మరణాలను నివారించడానికి రైతులు, ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గర ఆశ్రయం తీసుకోవద్దని వెదర్‌మ్యాన్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వాతావరణం.. వడగళ్ల తుఫానుల వంటి తీవ్రమైన వాతావరణానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయి. కృష్ణా, ఏలూరు, కోనసీమ, గోదావరి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు ఆంధ్రప్రదేశ్ వాతావరణ నిపుణులుగా పేరుగాంచిన ప్రణీత్ తెలిపారు.

కొన్ని చోట్ల 100 మి.మీ కంటే ఎక్కువ వర్షం కురుస్తుంది. ఏలూరు, కాకినాడ, రాజమండ్రిలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ-అమరావతి ప్రకారం.. ''రాగల మూడు గంటల్లో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కడపలో కొన్ని చోట్ల తేలికపాటి ఉరుములు, 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.'' రాబోయే ఐదు రోజులు భారతదేశంలో హీట్ వేవ్ పరిస్థితులు ఏర్పడే అవకాశం లేదని, ఈ రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Next Story