AP: పలు ప్రాంతాల్లో వేడిగాలులు.. జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణశాఖ

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటాయి.

By అంజి  Published on  12 April 2023 6:15 AM GMT
Heat waves, andhrapradesh, IMD, APSDMA, APnews

AP: పలు ప్రాంతాల్లో వేడిగాలులు.. జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణశాఖ

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ దాటాయి. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప, ప్రజలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) ప్రకారం.. 32 మండలాల్లో వేడి గాలుల పరిస్థితులు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. మైదాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటే లేదా 4 నుండి 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటే.. అది హీట్‌వేవ్‌గా వర్గీకరించబడుతుంది. ఏపీఎస్‌డీఎంఎ డైరెక్టర్ బీఆర్ అంబేద్కర్.. ప్రజలు వేడిగాలుల పరిస్థితుల దృష్ట్యా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

"రాబోయే మూడు రోజుల పాటు కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో హీట్‌వేవ్ చాలా బలంగా ఉంటుంది, మధ్యాహ్నం సమయంలో చాలా చోట్ల 42-43 డిగ్రీలు నమోదవుతాయి." ఆంధ్ర ప్రదేశ్ వాతావరణ నిపుణులుగా ప్రసిద్ధి చెందిన సాయి ప్రణీత్ పేర్కొన్నారు. విజయవాడలో 40 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నంలో 37 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ

భారత వాతావరణ శాఖ (IMD) అమరావతి.. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు, ఏలూరు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాలలో ఏప్రిల్ నుండి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, ఏఎస్‌ఆర్ జిల్లాల్లో వేడిగాలుల ప్రభావం ఉంటుందని ఐఎండీ, అమరావతికి చెందిన ఎస్ కరుణసాగర్ తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అనకాపల్లి, పల్నాడు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో వేడిగాలుల ప్రభావం ఉంటుంది.

బాపట్ల, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఈ కాలంలో వేడిగాలులు ఎక్కువగా ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, ఏఎస్‌ఆర్ జిల్లాల్లో ఏప్రిల్‌లో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు వీస్తాయని ఆయన తెలిపారు.

Next Story