అమరావతి: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ లేఖ రాశారు. ఈ మేరకు మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం ఆపాలని వైఎస్ జగన్‌ను మంత్రి సత్యకుమార్ కోరారు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని అబద్దాలు చెప్తున్నారు. రూ.8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి 1451 కోట్లకే బిల్లులు చెల్లించారు. నిర్మించిన మెడికల్ కాలేజీల్లోనూ అడ్మిషన్లు తీసుకురాలేకపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లపై దృష్టిసారించాం. జగన్ తరహాలో కూటమి విఫలం కాకూడదనే పీపీపీ విధానం ఎంచుకున్నాం. పీపీపీకీ, ప్రైవేటీకరణకూ వ్యత్యాసం ఉంది. మెడికల్ కాలేజీలపై తన వివరణకు జగన్ స్పందించాలి..అని మంత్రి సత్యకుమార్ లేఖలో కోరారు.