అమరావతి: ఉచిత సిలిండర్ పేరిట అరకొరగా లబ్ధిదారులను కూటమి ప్రభుత్వం ఎంపిక చేసిందని వైసీపీ దుయ్యబట్టింది. దీంతో దాదాపు అరకోటి మందిని పథకానికి దూరంగా ఉంచిందని ఎక్స్‌లో ట్వీట్ చేసింది. చంద్రబాబు చెప్పేవన్నీ గ్యాస్ కబుర్లేనని విమర్శలు చేసింది. ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వడానికి రూ.4 వేల కోట్లు అవసరం అయితే ప్రభుత్వం రూ.2,684.75 కోట్లు ఇస్తోందని ఆరోపించింది.
అటు రాష్ట్రంలో 1.54 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తాత్కాలిక అంచనా ప్రకారం.. ఫ్రీ సిలిండర్‌కు 1.08 కోట్ల కనెక్షన్లు అర్హత పొందగా, రేషన్ కార్డులు 1.48 కోట్లు ఉన్నాయి. కొంతమంది ఆధార్ ఇవ్వకపోవడంతో అర్హత పొందలేకపోయారు. వీరు ఆధార్ అనుసంధానం చేసుకుంటే ఫ్రీ సిలిండర్ పథకానికి అర్హులు అవుతారు. ఉచిత సిలిండర్ పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది.