కొడాలి నాని.. పేర్ని నాని మధ్య ఫ్రెండ్ షిప్ ఇంత బలంగా ఉందా..?

Machilipatnam MLA Perni Nani praised Gudiwada MLA Kodali Nani. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశంసించారు.

By Medi Samrat  Published on  30 April 2023 2:03 PM GMT
కొడాలి నాని.. పేర్ని నాని మధ్య ఫ్రెండ్ షిప్ ఇంత బలంగా ఉందా..?

గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ప్రశంసించారు. కొడాలి నాని వంటి డైనమిక్ లీడర్ స్నేహితుడిగా దొరకడం అదృష్టమని చెప్పారు. గుడివాడ బస్సు డిపో ప్రారంభోత్సవంలో ఓ కార్యక్రమంలో పేర్ని నాని మాట్లాడుతూ ..151 ఎమ్మెల్యేల్లో కొడాలి నాని పెద్దగా చదువుకోని వ్యక్తిగా కనిపిస్తాడని.. పెద్దగా చదువుకోలేదని కొడాలి నాని చెప్పేవి డ్రామా మాటలని అన్నారు. గడ్డం, రుద్రాక్ష రౌడీ గెటప్ మాదిరిగా కనిపిస్తాయని చెప్పారు. అయితే కొడాలి నాని బుర్ర పాదరసం కంటే వేగంగా పనిచేస్తుందని అన్నారు. కొడాలి నానిని ఓడించడానికి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారని అన్నారు. నాని నోట్లో కిళ్లీ వేసుకుంటాడని అనుకుంటారని, అయితే నాని ఐదో సారి కూడా గెలవడానికి స్కెచ్ వేసి ఉంచాడని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయాలలో తాను చూసిన వ్యక్తుల్లో కొడాలి నాని అంత తెలివైన వారు లేరని అన్నారు. రాష్ట్రంలో జనాల గుండెల్లో జగన్ ఎలా పాతుకుపోయారో, కొడాలి నాని కూడా గుడివాడ జనాల గుండెల్లో పాతుకుపోయారని అన్నారు.


Next Story