ఐపీఎస్ అధికారి బిందు మాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత‌

పల్నాడు జిల్లా మాజీ ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల వేళ ఈసీ వేటుకు గురైన ఆయనపై సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది.

By Medi Samrat  Published on  16 Jun 2024 7:08 PM IST
ఐపీఎస్ అధికారి బిందు మాధవ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత‌

పల్నాడు జిల్లా మాజీ ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల వేళ ఈసీ వేటుకు గురైన ఆయనపై సస్పెన్షన్ ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఐపీఎస్ అధికారి బిందు మాధవ్ ను వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో బిందు మాధవ్ పల్నాడు ఎస్పీగా ఉన్నారు. పల్నాడులో ఘర్షణలు జరగడంతో బిందు మాధవ్ ను ఈసీ సస్పెండ్ చేసింది. ఇక బిందు మాధవ్ వివరణను పరిగణనలోకి తీసుకున్న ఏపీ సర్కారు ఆయనను మళ్లీ విధుల్లోకి తీసుకుంది.

ఇక ఏపీ సీఎం చంద్రబాబు పలు శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక వాలంటీర్ల సేవలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాలంటీర్లకు విద్యార్హత నిర్ణయించి వారిని కొనసాగించే దిశగా చర్చలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు వైసీపీ కోసం రాజీనామా చేసిన వారు ఇప్పుడు తిరిగి విధుల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. వీరి విషయంలో ఏపీ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Next Story