అమరావతి: పెన్షన్ మొదలు ఫీజు రీయింబర్స్‌మెంట్ వరకు, దీపం-2 పథకం వర్తింపజేయాలన్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు ఉండి తీరాల్సిందేనని టీడీపీ ట్వీట్ చేసింది. అందుకే సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని పేర్కొంది. డిసెంబర్ 2 నుంచి 28 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. పాతవాళ్లకూ కొత్తరేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
కొత్తగా రేషన్ కార్డులు కావాలనుకునేవారు డిసెంబరు 2 నుంచి 28 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త కార్డులు, మార్పులు, చేర్పులు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంక్రాంతి లోపు అర్హులను గుర్తించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ మార్గదర్శకాలకనుణంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. కొత్తగా పెళ్లైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలన్న నిర్ణయం అమల్లో ఉన్నందున అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త కార్డులు ఇవ్వనుంది కూటమి ప్రభుత్వం. దీంతో కొత్త జంటలతో పాటు తల్లిదండ్రుల నుంచి వేరుగా ఉంటున్న వారికి కూడా కొత్త రేషన్ కార్డులు దక్కనున్నాయి.