ఏపీలో అసంపూర్తిగా మెడికల్ కాలేజీలు..పీపీపీ పద్ధతిలో పూర్తికి సర్కార్ సిద్ధం

రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న‌ మ‌రో 5 మెడిక‌ల్ కాలేజీలను పీపీపీ ప‌ద్ద‌తిలో పూర్తి చేయ‌డానికి కూట‌మి స‌ర్కార్ సిద్ద‌మైంది.

By -  Knakam Karthik
Published on : 22 Jan 2026 5:49 PM IST

Andrapradesh, Ap Government, Medical Colleges, PPP method

ఏపీలో అసంపూర్తిగా మెడికల్ కాలేజీలు..పీపీపీ పద్ధతిలో పూర్తికి సర్కార్ సిద్ధం

అమరావతి: రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న‌ మ‌రో 5 మెడిక‌ల్ కాలేజీలను పీపీపీ ప‌ద్ద‌తిలో పూర్తి చేయ‌డానికి కూట‌మి స‌ర్కార్ సిద్ద‌మైంది. రెండో ద‌శ‌లో భాగంగా అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, నర్సీపట్నం, పెనుకొండ లో మెడిక‌ల్ కాలేజీలు పీపీపీ ప‌ద్ద‌తిలో పూర్తి చేసేలా ప్లాన్ చేసింది. 5 మెడిక‌ల్ కాలేజీల‌కు పూర్తికి చేయాలంటే సుమారు 2,500 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది అంచ‌నా. దీనిలో వయబిలిటీ గ్యాప్ ఫండ్‌గా రూ.500 కోట్లు ఇవ్వాల‌ని కేంద్రాన్ని కోరాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న 17 మెడిక‌ల్ కాలేజీలు దానికి అనుబంధ హ‌స్ప‌ట‌ల్స్ నిర్మాణాన్ని ఎట్టి ప‌రిస్టితుల్లో పూర్తి చేయాల‌ని ఏపి ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. వాటిని అలాగే వ‌దిలేస్తే ఇప్ప‌టికే చేసిన వ్యయం వృధా అవుతుంద‌ని ఏపి ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇందుకోసం (ప‌బ్లిక్ ప్ర‌యివేట్ పార్ట‌న‌ర్ షీప్) పీపీపీ విధానం లో పూర్తి చేయాల‌ని ప్లాన్ సిద్దం చేసింది.

ఇందుకోసం ఇప్ప‌టికే మొదటి ద‌శ‌లో ఆదోని, మార్కాపురం, పులివెందుల, మ‌ద‌నప‌ల్లి లోని మెడిక‌ల్ కాలేజీల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం టెండ‌ర్లు పిలిచింది. ఇందులో ఆదోని మెడిక‌ల్ కాలేజీకి మాత్ర‌మే టెండ‌ర్ వేశారు. మిగిలిన వాటికి టెండ‌ర్లు రాక పోవాడానికి ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన వాటి వ‌ల‌న ప్ర‌యివేట్ సంస్థ‌ల‌కు న‌ష్టం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వానికి తెలిపాయి. అయితే ఇప్ప‌టికే టెండ‌ర్‌లో ఆదోని మెడిక‌ల్ కాలేజీని ద‌క్కించుకున్న సంస్థతో ఒప్పందం చేసుకోవాల‌ని వైద్య ఆరోగ్య శాఖను క్యాబినెట్ ఆదేశించింది. దీనిపై త్వ‌ర‌లో ప్ర‌భుత్వం వారితో ఒప్పందం చేసుకోనుంది.

Next Story